News April 30, 2024
నేడు దెందులూరుకు చంద్రబాబు

AP: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ దెందులూరులో పర్యటించనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. అక్కడ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం తిరిగి హెలికాప్టర్లో ఉండవల్లికి చేరుకుంటారు.
Similar News
News March 13, 2026
ఫ్లాష్ ఫ్లడ్స్‌ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <
News March 13, 2026
సీక్వెల్ సినిమాకి డైరెక్టర్‌గా బోయపాటి?

‘అఖండ-2’ తర్వాత బోయపాటి శ్రీను చేసే తర్వాత సినిమా ఏంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. సన్నీ డియోల్‌తో ‘జాట్-2’ డైరెక్ట్ చేయమని ఆయన్ను మైత్రీ సంస్థ సంప్రదించినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘జాట్’కు ఇది సీక్వెల్‌గా రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్‌ను తీసుకుంటారా? వదులుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
News March 13, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు


