News August 22, 2024
రేపు కోనసీమకు చంద్రబాబు

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు రేపు కోనసీమ(D) వానపల్లిలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభమయ్యే గ్రామసభలో ఆయన పాల్గొంటారు. ఉపాధి హామీ పనుల గురించి స్థానికులతో ఆయన చర్చించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. మరోవైపు అచ్యుతాపురంలోని ప్రమాద స్థలాన్ని ఇవాళ సీఎం పరిశీలించనున్నారు.
Similar News
News January 29, 2026
చిరుతతో పోరాడి కొడుకును కాపాడుకున్న వృద్ధుడు!

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో చిరుతతో పోరాడి కొడుకును కాపాడుకున్నాడో వ్యక్తి. బాబుభాయ్(60) ఇంట్లో కూర్చొని ఉండగా చిరుతపులి దాడి చేసింది. అక్కడే ఉన్న శార్దూల్(27) అరవడంతో అతడిపైకి దూకింది. దీంతో కొడుకును కాపాడుకునేందుకు బాబుభాయ్ కొడవలి, ఈటెతో చిరుతను కొట్టి చంపేశాడు. తర్వాత అటవీ అధికారులకు సమాచారమిచ్చాడు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News January 29, 2026
రాత్రి నానబెట్టి ఉదయం తింటే..

రోజువారీ ఆహారంలో పెసలు తప్పకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉండే పెసలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి.
*పీచు పదార్థం ఆకలిని నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది.
*చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తుంది.
*గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి.
**రాత్రి నానబెట్టి ఉదయం మొలకల రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
News January 29, 2026
SC స్కాలర్‌షిప్‌లకు ఆదాయ పరిమితిని పెంచనున్న కేంద్రం

SC విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల మంజూరులో పేరెంట్స్ గరిష్ఠ ఆదాయ పరిమితిని ₹2.5 లక్షల నుంచి ₹4.5 లక్షలకు కేంద్రం పెంచనుంది. దీనిపై నోట్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్సులను బట్టి హాస్టలర్స్‌కు రూ.4,000-13,500, డేస్కాలర్స్‌కు రూ.2,000-7,500 వరకు స్కాలర్షిప్ అందిస్తున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్ సూచనల తర్వాత క్యాబినెట్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీకి నోట్‌ను అందిస్తారు.


