News April 28, 2024
నేడు నెల్లూరు, కర్నూలుకు చంద్రబాబు

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెల్లూరులోని కోటమిట్ట వద్ద ఓ ఫంక్షన్ హాల్లో ముస్లింలతో ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కర్నూల్ జిల్లా కౌతాళంలో, రాత్రి 7 గంటలకు గూడూరులో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. రాత్రికి గూడూరులోనే ఆయన బస చేయనున్నట్లు సమాచారం.
Similar News
News November 22, 2025
మావోయిస్టు దామోదర్ పేరుతో ఫోన్ కాల్స్ కలకలం!

మావోయిస్టు అగ్రనేత తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావ్@ దామోదర్ పేరిట కొందరు వ్యాపారులకు ఫోన్ చేస్తుండటం జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాలోని ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్ చేసి డబ్బులు అడగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయాన్ని జిల్లాలో అక్కడక్కడ స్థానికులు మాట్లాడుకోవడం గమనార్హం. దామోదర్ పేరుతో ఫోన్ ఎవరు చేశారు? దామోదర్ ఎక్కడున్నాడనే విషయంపై సందిగ్ధం నెలకొంది.
News November 22, 2025
GREAT: బ్యాగులో రూ.10,00,000.. అయినా పైసా ముట్టలేదు!

పుణే(MH)కు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే గొప్ప మనసు చాటుకున్నారు. గురువారం చెత్త ఏరుతుండగా ఆమెకు ఓ బ్యాగ్ దొరికింది. అందులో డబ్బు, మెడిసిన్లు కనిపించాయి. అది ఎవరిదో కనుక్కునేందుకు ఆ వీధి అంతా తిరిగింది. ఓ వ్యక్తి టెన్షన్తో కనిపించడంతో అతడికి వాటర్ ఇచ్చింది. బ్యాగ్ దొరికిందని ఇచ్చేసింది. అందులో రూ.10 లక్షల క్యాష్ ఉంది. దీంతో ఆమె నిజాయతీకి మెచ్చిన బ్యాగ్ యజమాని చీర, కొంత డబ్బు ఇచ్చాడు.
News November 22, 2025
ఈ నెల 25 నుంచి 17వ పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

దక్షిణాసియాలోనే అతిపెద్ద 17వ పౌల్ట్రీ ఇండియా-2025 ప్రదర్శన ఈ నెల 25-28 వరకు HYDలోని HICCలో జరగనుంది. దీనికి 1,500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 50 దేశాల నుంచి 500లకు పైగా ఎగ్జిబిటర్లు, 40 వేలకు పైగా సందర్శకులు హాజరుకానున్నారు. పౌల్ట్రీరంగంలో సమస్యలు, AI, ఆటోమేషన్, ఉపాధి వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు. ఈ సదస్సుకు హాజరుకావాలని CM రేవంత్రెడ్డికి నిర్వాహకులు ఆహ్వానం అందించారు.


