News July 3, 2024

అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్న చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజధాని అమరావతిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లలో అమరావతిలో జరిగిన విధ్వంసం, తాజా పరిస్థితిని శ్వేతపత్రం ద్వారా వివరించనున్నారు. అమరావతిపై భవిష్యత్ కార్యాచరణను కూడా సీఎం వెల్లడించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాత్రి 7.30 గంటలకు CM ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.

Similar News

News October 13, 2024

ప్రపంచంలోనే ఇండియన్ ఫుడ్ బెస్ట్

image

ప్రపంచంలోనే (జీ20 దేశాలు) భారతీయ ఆహారం అత్యుత్తమం అని స్విట్జర్లాండ్‌కు చెందిన WWF లివింగ్ ప్లానెట్ రిపోర్టు-2024 వెల్లడించింది. ఇండియన్లు ఎక్కువగా మొక్కల నుంచి వచ్చే ఆహారం తీసుకుంటారని, అప్పుడప్పుడు మాంసాహారం తీసుకోవడం వల్ల సుస్థిర ఆహార వినియోగాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. US, ఆస్ట్రేలియా, అర్జెంటీనా ఫుడ్ అత్యంత చెత్త ర్యాంకింగ్ నమోదు చేసిందని పేర్కొంది.

News October 13, 2024

జైలులో నాటకం.. సీతను వెతుకుతూ ఖైదీల పరార్

image

ఉత్తరాఖండ్‌లోని రోషనాబాద్ జైలులో నాటకమాడుతూ ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దసరా సందర్భంగా జైలులో రామాయణం నాటకం వేశారు. ఇందులో భాగంగా వానర పాత్రధారులు పంకజ్, రాజ్ కుమార్.. సీతను వెతికే క్రమంలో 22 అడుగుల జైలు గోడపై నుంచి పోలీసులు, తోటి ఖైదీలు చూస్తుండగానే దూకి పరారయ్యారు. పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు, రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

News October 13, 2024

మాజీ మంత్రి హత్య.. సీఎం రాజీనామాకు విపక్షాల డిమాండ్

image

మహారాష్ట్రలో మాజీ మంత్రి, NCP నేత బాబా సిద్దిఖీ దారుణ <<14343654>>హత్యకు<<>> గురికావడం సంచలనం రేపింది. దీనికి సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడణవీస్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని NCP(SP), శివసేన(UBT) డిమాండ్ చేశాయి. Y కేటగిరీ భద్రత కలిగిన రాజకీయ నేతనే కాపాడలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలను ఏం కాపాడుతుందని ప్రశ్నించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తాయి.