News June 12, 2024

నేడు తిరుమలకు చంద్రబాబు

image

AP: శ్రీవారి దర్శనార్థం టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ తిరుమల రానున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడికి చేరుకుంటారు. రేపు ఉదయం సీఎం హోదాలో శ్రీవారిని దర్శించుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే బాబు బస చేసే కాటేజ్, కాన్వాయ్ ప్రయాణించే మార్గాలను భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.

Similar News

News December 23, 2024

‘దేవర-2’ స్క్రిప్ట్ పనులు ప్రారంభం?

image

‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ప్రారంభమైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

News December 23, 2024

MS ధోనీ క్రికెట్ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు!

image

స్టైలిష్‌గా పొడవాటి జుట్టుతో MS ధోనీ 2004లో డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌‌పై మ్యాచుతో అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్‌లో ‘0’కే రనౌట్‌ అయినా, ఆపై అంచెలంచెలుగా ఎదిగి IND మేటి కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. 2007 T20WC, 2011 వన్డే WC, 2013లో CT సాధించారు. అలాగే IPLలోనూ CSKకు 5 ట్రోఫీలు అందించారు. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా IPL ఆడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.

News December 23, 2024

సన్నీలియోన్ పేరిట అకౌంట్.. నెలకు రూ.1000

image

నటి సన్నీలియోన్ పేరిట అకౌంట్ క్రియేట్ చేసిన ప్రబుద్ధుడు నెలనెలా రూ.1000 పొందుతున్నాడు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పెళ్లైన మహిళలకు ‘మహతారి వందన్ యోజన’ పేరుతో ప్రతి నెలా అకౌంట్లో రూ.వెయ్యి జమ చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న వీరేందర్ జోషి ఫేక్ ఖాతాతో మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అకౌంట్‌ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ పథకంలో 50% ఫేక్ అకౌంట్లు ఉన్నాయని BJP సర్కారుపై కాంగ్రెస్ విమర్శించింది.