News June 12, 2024

నేడే చంద్రబాబు ప్రమాణస్వీకారం

image

AP: సీఎంగా చంద్రబాబు ఇవాళ ఉదయం 11.27కు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. PM మోదీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు.

Similar News

News December 23, 2024

నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా: నటుడు

image

అల్లు అర్జున్ కేసుపై పోలీసులు ఇచ్చిన వివరణ తర్వాత నటుడు రాహుల్ రామకృష్ణ Xలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘ఇటీవల జరిగిన ఘటనల గురించి నిజంగా నాకు తెలియదు. అందుకే గతంలో చేసిన స్టేట్‌మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, లా అండ్ ఆర్డర్ వైఫల్యాన్ని ఓ వ్యక్తి చేసిన తప్పుగా పరిగణించడం సరికాదని ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

News December 23, 2024

STOCK MARKETS: లాభాల్లో పరుగులు..

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్‌మార్కెట్లు పుంజుకున్నాయి. డాలర్ బలం తగ్గడం, మంచి షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. సెన్సెక్స్ 78,682 (+637), నిఫ్టీ 23,773 (+194) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఫైనాన్స్ షేర్లకు డిమాండ్ పెరిగింది. SHRIRAMFIN, JSWSTEEL, HDFC BANK టాప్ గెయినర్స్.

News December 23, 2024

అల్లు‌ అర్జున్ పేరు ప్రస్తావించని CM రేవంత్!

image

TG: నిన్న OU JAC నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం ‘సినీ ప్రముఖుల ఇళ్ల‌పై దాడి ఘటనను ఖండిస్తున్నా’ అని CM రేవంత్ ట్వీట్ చేశారు. బన్నీ ఇంటిపైనే దాడి జరిగినట్లు స్పష్టమవుతున్నా ఆయన బన్నీ పేరు ప్రస్తావించలేదు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి మాత్రం అర్జున్ పేరుతోనే ట్వీట్ చేశారు. కాగా, అల్లు అర్జున్ పేరును పలికేందుకు CM విముఖత చూపుతున్నారా? దీనిపై మీ COMMENT.