News July 31, 2024

భూముల రీసర్వేపై చంద్రబాబు యూటర్న్: అంబటి

image

AP: ఎన్నికల ప్రచారంలో భూముల రీసర్వేను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రీసర్వేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మాట మార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు అబద్ధంలోనే పుట్టారని, అందులోనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్‌ను అమలు చేయలేక శ్వేతపత్రాలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

Similar News

News April 11, 2026

2028 నుంచి పెట్రోల్ బైకుల రిజిస్ట్రేషన్ నో

image

కాలుష్య నివారణే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-30ని డ్రాఫ్ట్ చేసింది. 30 రోజుల పాటు నిపుణులు, ప్రజల నుంచి సలహాలు తీసుకొని దాన్ని ఖరారు చేయనుంది. 2028 ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్‌తో నడిచే టూవీలర్లను ఢిల్లీలో రిజిస్టర్ చేయరు. కేవలం ఈవీలు మాత్రమే చేస్తారు. అలాగే ఈవీలు కొనేవారికి భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. 100% రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించారు.

News April 11, 2026

గ్రాఫిక్స్‌లో ‘రామాయణ’ తగ్గేదేలే!

image

రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ సినిమా బాలీవుడ్‌లో కొత్త విజువల్ వండర్‌గా నిలవనుంది. హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ తరహాలో అత్యాధునిక VFX, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఈ చిత్రం కోసం ఉపయోగిస్తున్నారు. ఆస్కార్ గెలిచిన DNEG సంస్థ గ్రాఫిక్స్ బాధ్యతలు చూస్తోంది. దాదాపు ₹4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

News April 11, 2026

తిరుమల క్షేత్రపాలకుడు ఎవరో కాదు…!

image

7 కొండలపై కోట్లాది భక్తులకు అభయమిస్తున్న శ్రీవారి ఆలయానికి క్షేత్రపాలకుడు త్రిమూర్తుల్లో ఒకరైన శివుడి మరో రూపమైన రుద్రుడు. ఈ క్షేత్రపాలక శిల తిరుమల గోగర్భం వద్ద, పాపవినాశనం వెళ్లే మార్గంలో ఉంది. శివకేశవులకు భేదం లేదని ఇది నిరూపిస్తోంది. ప్రతి మహా శివరాత్రి రోజున TTD వారు ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. తిరుమలలో విష్ణువుతో పాటు రుద్రుడికి కూడా ప్రాధాన్యత ఉందనడానికి ఇదే నిదర్శనం