News October 29, 2024

మద్యం షాపులకు చంద్రబాబు వార్నింగ్

image

AP: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని సీఎం చంద్రబాబు అన్నారు. బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే లిక్కర్ షాపులకు రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రెండో సారి నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై నిఘా పెట్టాలన్నారు.

Similar News

News October 29, 2024

వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు: పవన్ కళ్యాణ్

image

AP: భూమ్మీద జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదులకు మనలాగే బతికే హక్కు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. వన్యప్రాణులను వేటాడి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. వాటి సంరక్షణ కోసం యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. వన్య ప్రాణులను వేటాడటాన్ని అరికట్టేందుకు 18004255909 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

News October 29, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: అక్టోబర్ 29, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:13 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 29, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.