News October 16, 2024
ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు.. అడ్డుకోవద్దు: చంద్రబాబు

AP: ఉచిత ఇసుక విషయంలో కూటమి MLAలు జోక్యం చేసుకుంటే ఎవర్నీ వదలబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇందులో తన, మన అనేవి ఉండవు. ఇసుక ఉచితంగానే తీసుకెళ్లాలి. ఎవరైనా ఎడ్ల బండి తీసుకొచ్చి ఇసుక తీసుకెళ్లవచ్చు. వారిపై కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం. దీనిలో ఎవరి పెత్తనాన్నీ సహించం. ఎవరి ఊరిలో వాళ్లకు ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో ఎవరి పెత్తనం వద్దు’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News November 25, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,615 మంది భక్తులు దర్శించుకోగా 27,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.
News November 25, 2025
దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు.. వచ్చే నెల 3న ఏర్పాటు

TG: రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గత నెలలో గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా లక్షన్నర మంది దివ్యాంగ మహిళలు, పురుషులను సెర్ప్ గుర్తించింది. మహిళల అధ్యక్షతన ఒక్కో స్వయం సహాయక సంఘంలో 5 నుంచి 10 మంది వరకు సభ్యులు ఉండాలని నిర్దేశించింది.
News November 25, 2025
పీరియడ్స్ రావట్లేదా..? అయితే జాగ్రత్త

కొంతమందికి ప్రతినెలా పీరియడ్స్ రావు. దానికి వ్యాధులు, తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం, బరువు హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటివి కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఏ కారణంతో పీరియడ్స్ రావడం లేదో వైద్యులను సంప్రదించి తెలుసుకోవడం చాలా అవసరం. పీరియడ్స్ మీ ఆరోగ్య స్థితికి అద్దంపడతాయి. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఏదో అంతర్లీన సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే తగిన వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం.


