News September 11, 2024
10 రోజుల తర్వాత ఇంటికెళ్లిన చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు 10 రోజుల తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు ఈ నెల 2 నుంచి సీఎం కలెక్టరేట్లోనే బస్సులో బస చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. వినాయక చవితి, పెళ్లి రోజును కూడా ఆయన అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం వరద సహాయక చర్యలు ముగియడంతో సీఎం ఇంటికి వెళ్లారు.
Similar News
News November 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 24, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 24, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 24, 2025
సౌదీ బస్సు ప్రమాదం.. మృత్యుంజయుడిని కలిసిన ప్రభుత్వ బృందం

సౌదీలో ఈ నెల 17న జరిగిన బస్సు ప్రమాదంలో HYDకు చెందిన 46 మంది ఉమ్రా యాత్రికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ <<18316836>>షోయబ్ను<<>> సౌదీలో TG ప్రభుత్వ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో MLA మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ కార్యదర్శి (మైనారిటీ సంక్షేమం) బి.షఫియుల్లా అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.


