News April 29, 2024
ఈ పథకాలు ఎందుకు తేలేకపోయావు చంద్రబాబూ?: సీఎం జగన్

AP: తనను బచ్చా అని పిలుస్తోన్న చంద్రబాబు.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి ఒక్క మంచి పథకమైనా ఎందుకు తీసుకురాలేకపోయారని సీఎం జగన్ ప్రశ్నించారు. పొన్నూరు సభలో మాట్లాడుతూ.. ‘నేను తెచ్చిన అమ్మ ఒడి, విద్యా దీవెన, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, వాహన మిత్ర, ఇంటికే పెన్షన్, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా లాంటి పథకాలు చంద్రబాబు ఎందుకు అమలు చేయలేకపోయారు?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 28, 2025
BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్లో భారీగా ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్లో వివిధ జోన్లలో 110 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తును ఇ- మెయిల్ ద్వారా careers@bobcaps.inకు పంపాలి. వెబ్సైట్: https://www.bobcaps.in/
News November 28, 2025
ఈ పురుగు యమ డేంజర్.. కుడితే అంతే..

AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్లి తరహా ఉండే ఈ చిన్న పురుగు ఓరియంటియా సట్సుగముషి అనే బ్యాక్టీరియా రూపం. ఇది కుడితే చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. వారం తర్వాత జ్వరం, జలుబు, వణుకు, నీరసం, ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించకుంటే ప్లేట్లెట్స్ పడిపోవడం, మెదడు, తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్ఫెక్షన్ సోకుతాయి.
News November 28, 2025
వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులతో ఢిల్లీ ప్రజల అగచాట్లు

ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 80%పైన పౌరులు దగ్గు, అలసట, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ‘గత ఏడాదిలో 68.3% మంది కాలుష్య సంబంధిత వ్యాధులతో చికిత్స తీసుకుంటున్నారు. 79.8% మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లడానికి ఆలోచిస్తున్నారు. గృహ ఖర్చులు పెరిగాయని 85.3% మంది తెలిపారు. 41.6% తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని తేలింది.


