News November 14, 2024
చంద్రబాబూ.. నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?: రజిని

AP: సూపర్ సిక్స్ హామీలిచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని మాజీ మంత్రి రజిని ప్రశ్నించారు. ‘ఆడబిడ్డ నిధి, దీపం, తల్లికి వందనం, అన్నదాత పథకాలకు ఎన్ని కోట్లు కేటాయించావ్? ఉచిత బస్సుకు అతీగతీలేదు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావ్? రూ.4వేల పింఛన్ ఎంత మందికిచ్చావ్? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తానంటున్నావ్? నాతో సహా మా పార్టీ కార్యకర్తలు నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు’ అని తెలిపారు.
Similar News
News November 19, 2025
మేడ్చల్: వరి సాగు చేశారా..? ఈ నంబర్లు ఫీడ్ చేసుకోండి

మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వరి సాగు చేసిన రైతులకు అధికారులు సూచన చేశారు. 1967,1800 425 00333 నంబర్లను మీ వద్ద ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు సమయంలో ఏదైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయవచ్చని, HYDలో సివిల్ సప్లై భవన్ నుంచి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల పై సైతం ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News November 19, 2025
ములుగు: పోలీసుల అదుపులో దేవ్ జీ..?

ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి@దేవ్ జీ ఉన్నట్లు తెలుస్తోంది. మడవి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నంబాల కేశవరావుకు సంబంధించిన సెక్యూరిటీతో పాటు మరి కొంత మంది కీలక నేతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వినవస్తుంది. రేపు వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
News November 19, 2025
సంగారెడ్డి: 20న నిరుద్యోగులకు జాబ్ మేళా

SRD జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ (EGMM) ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారిణి జ్యోతి తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయం బైపాస్ రోడ్లో 20న ఉదయం 10 గంటలకు మేళా జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 99664 64500 నంబర్ను సంప్రదించాలన్నారు.


