News July 5, 2024
ఎన్టీఆర్ భవన్లో 7న చంద్రబాబుకు సన్మానం

TG: ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో సన్మానం చేయాలని టీటీడీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చింది. APకి సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఈరోజు సాయంత్రం CBN నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించేందుకు రాష్ట్ర టీడీపీ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర సీఎం రేవంత్‌తో బాబు రేపు భేటీ కానున్నారు.
Similar News
News November 19, 2025
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 19, 2025
న్యూస్ రౌండప్

✦ TGలో నేటి నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. మ.12 గంటలకు HYD నెక్లెస్ రోడ్డులో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద చీరల పంపిణీని ప్రారంభించనున్న CM రేవంత్
✦ పార్టీ ఫిరాయింపులపై నేడు, రేపు MLAల విచారణ.. నేడు తెల్లం వెంకట్రావు, సంజయ్, రేపు పోచారం, అరికెపూడి గాంధీకి సంబంధించిన పిటిషన్ల విచారణ
✦ రేపు బిహార్‌కు CM CBN, మంత్రి లోకేశ్.. నితీశ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడంతో పాటు పారిశ్రామికవేత్తలతో భేటీ
News November 19, 2025
మావోయిస్టుల కథ ముగిసినట్టేనా?

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా హతం అవుతున్నారు. 5 నెలల్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోయారు. పలువురు ప.బెంగాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. తాజాగా హిడ్మా మృతితో కేంద్ర నాయకత్వం మరింత బలహీనపడింది.


