News June 5, 2024
చంద్రబాబు ఆ తప్పు చేయరు: ఐవైఆర్
AP: కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్ల సుస్థిర పాలన అందిస్తుందని మాజీ ఐఏఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ‘చంద్రబాబు, నితీశ్ కుమార్ దీర్ఘకాలిక అనుభవం ఉన్న నాయకులు. కలగూరగంపలా ఉన్న I.N.D.I.A కూటమి అధికారంలోకి వచ్చినా ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో వీరు ఆ కూటమి వైపు వెళ్లే తప్పు చేయరు’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News January 10, 2025
గాయపడిన హీరోయిన్ రష్మిక!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది. జిమ్లో వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయం అయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. పుష్ప-2 సినిమా విజయం తర్వాత ఆమె సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సికందర్’లో నటిస్తున్నారు. చిత్రీకరణ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతుండగా రష్మిక గాయపడటం గమనార్హం. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని రష్మిక అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
News January 10, 2025
బాలయ్య ఫ్యాన్స్కు కిక్కిచ్చే న్యూస్
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహరాజ్’ సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతోంది. రిలీజ్ ట్రైలర్ను ఇవాళ సా.5:53 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది మొదటి ట్రైలర్ను మించేలా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా, తమన్ సంగీతం అందించారు. ఈనెల 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
News January 10, 2025
బస్సు టికెట్ రూ.6వేలు, ఫ్లైట్ టికెట్ రూ.15వేలు
సంక్రాంతి పండక్కి వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోచుకుంటున్నారు. ఇదే అదనుగా బస్సు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ.4వేలు, విశాఖకు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. అటు HYD నుంచి విశాఖ ఫ్లైట్ టికెట్ ధర రూ.15వేలుగా ఉంది. డబుల్, ట్రిపుల్ రేట్లను వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.