News December 4, 2024

నేడు వినతులు స్వీకరించనున్న చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News October 19, 2025

గాజాపై దాడికి హమాస్ ప్లాన్!.. హెచ్చరించిన US

image

గాజాలోని పౌరులపై దాడి చేయాలని హమాస్ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా హెచ్చరించింది. ఈ విషయంలో తమకు విశ్వసనీయ సమాచారం ఉందని US విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పింది. మీడియేషన్ ద్వారా సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ హమాస్ దాడి చేస్తే ప్రజలను, సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

News October 19, 2025

బౌద్ధుల దీపావళి.. ఎలా ఉంటుందంటే?

image

దీపావళి బౌద్ధుల పండుగ కానప్పటికీ వజ్రయాన శాఖకు చెందినవారు దీన్ని వేడుకగా జరుపుకొంటారు. నేపాల్‌లోని ‘నేవార్’ ప్రజలు ‘తిహార్’ పేరుతో 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ స్వేచ్ఛ కోసం ఏ దేవతనైనా ఆరాధించవచ్చనే ఆచారం ప్రకారం వీరు లక్ష్మీదేవిని, విష్ణువును తమ దైవాలుగా భావించి పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా లక్ష్మీదేవిని ప్రార్థించడం ద్వారా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.

News October 19, 2025

DRDOలో 50 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

DRDO ఆధ్వర్యంలోని ప్రూప్& ఎక్స్‌పెరిమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో 50 అప్రెంటిస్‌లకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/