News November 20, 2024
చంద్రబాబు బకాయిలు రూ.42,183కోట్లు మేం కట్టాం: జగన్

AP: 2014-19 మధ్య చంద్రబాబు FRBM పరిధి దాటి రూ.28,457 కోట్ల అప్పు చేశారని వైఎస్ జగన్ వెల్లడించారు. తమ హయాంలో ఆ మొత్తం రూ.16,047 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇవన్నీ RBI, కాగ్ వెల్లడించిన గణాంకాలని చెప్పారు. ఎవరు విధ్వంసకారులో ఈ లెక్కలే చెబుతున్నాయన్నారు. చంద్రబాబు దిగిపోతూ పలు రంగాల్లో రూ.42,183 కోట్ల బకాయిలను తమకు గిఫ్ట్ ఇచ్చారని, ఆ మొత్తాన్ని తాము చెల్లించామని పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
భారీ జీతంతో CSIR-CECRIలో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(<
News December 8, 2025
ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్ వాడుతున్నారా?

ఇన్స్టాగ్రామ్లో AI డబ్బింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో క్రియేటర్లు తమ వీడియోలను ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి డబ్ చేయవచ్చు. ఒకే రీల్ను వేర్వేరు భాషల్లోని ప్రేక్షకుల కోసం డబ్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. దీనితో పాటు రీల్స్ స్క్రిప్ట్ కోసం కొత్త ఫాంట్లు వచ్చాయి. ఏ భాషలో ఉన్న రీల్నైనా అందుబాటులో ఉన్న భాషల్లోకి మార్చుకొని చూడొచ్చు.
News December 8, 2025
‘సిచ్యుయేషన్షిప్’లో భారత కంపెనీలు!

40 ఏళ్లు దాటిన ఉద్యోగులను కారణం చెప్పకుండా తొలగిస్తూ, వారి స్థానంలో ఫ్రెషర్స్ను భారత కంపెనీలు అపాయింట్ చేసుకుంటున్నాయి. ‘సిచ్యుయేషన్షిప్’గా పిలిచే ఈ ట్రెండ్ తాజాగా కార్పొరేట్, మీడియా, టెక్ కంపెనీల్లో మొదలైంది. యువత ముఖ్యంగా Gen Z చేస్తున్న పేరు లేని, బంధానికి కట్టుబడని రొమాంటిక్ రిలేషన్షిప్నే ‘సిచ్యుయేషన్షిప్’ అంటారు. MD, CEOలు సీనియర్ ఉద్యోగుల విషయంలో దీనినే ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.


