News July 6, 2024
చంద్రబాబు రాక.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు!

చంద్రబాబు రాకతో తెలంగాణలో సెంటిమెంట్ రాజుకుంటోంది. ఇకపై తెలంగాణలో చంద్రబాబు పెత్తనం నడవబోతుందని, కేసీఆర్ ఉంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేవారని BRS అభిమానులు పోస్టులు చేస్తున్నారు. గతంలో సీఎంగా ఉన్న జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని కాంగ్రెస్, టీడీపీ వాదిస్తున్నాయి. మరోసారి సెంటిమెంట్‌తో లబ్ధి పొందేందుకు BRS ప్రయత్నిస్తోందని మండిపడుతున్నాయి. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 30, 2026
IT సోదాలు.. రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య!

బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య చేసుకున్నారు. CONFIDENT కంపెనీ ఫౌండర్, ఛైర్మన్ CJ రాయ్ తన లైసెన్స్డ్ తుపాకీతో తనను తాను కాల్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదాయ పన్ను శాఖ రెయిడ్స్ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఇటీవల పదే పదే ఐటీ సోదాలు జరుగుతుండటంతో రాయ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, ఈ క్రమంలోనే సూసైడ్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News January 30, 2026
2026 జాబ్ మార్కెట్: 40sలో లేఆఫ్.. 20sలో బోరింగ్

2026లో జాబ్ మార్కెట్ తీరుపై ఇండియా టుడే ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 40sలో ఓవర్ క్వాలిఫైడ్ సాకుతో లేఆఫ్‌లు ఉంటాయి. 20sలో ఉద్యోగం పొందిన వారికి తరచూ ‘ఇక్కడ ఉండటం నీ లక్కీ’ లాంటి మాటలు వినిపిస్తాయి. మేనేజర్ తక్కువ ప్రాజెక్టులు ఇస్తారు. దీంతో ఫ్యూచర్‌పై ఆందోళన, విసుగు చెందడం ఉద్యోగి వంతవుతుంది. ఈ పరిస్థితికి కంపెనీలనే తప్పుపట్టకుండా స్థిరత్వం కోసం స్కిల్స్‌పై దృష్టిపెట్టాలంటున్నారు రిక్రూటర్లు.
News January 30, 2026
సకుంభ నికుంభుల అంతం ఎలా జరిగిందంటే..?

కుంభకర్ణుడి కొడుకులైన సకుంభ నికుంభులు లోకకంటకులుగా మారి, విభీషణుడి లంకపై దాడి చేశారు. వారి ధాటికి తట్టుకోలేక విభీషణుడు రాముడిని శరణు వేడాడు. యుద్ధంలో దానవులు యమదండంతో భరత శత్రుఘ్నులను మూర్ఛిల్లజేయగా, రాముడు ఆగ్రహించి వాయవ్యాస్త్రంతో ఆ సోదరులను సంహరించాడు. అనంతరం హనుమంతుడు అమృత కలశాన్ని తెచ్చి రామ సోదరులను పునర్జీవితులను చేశాడు. ఇలా రాముడు విభీషణుడిని ఆపద నుంచి కాపాడి ధర్మాన్ని నిలబెట్టాడు.


