News September 22, 2024

చంద్రబాబు పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం: VSR

image

AP: తప్పులు చేస్తూ ఎదుటివారి మీద నిందలు వేయడంలో చంద్రబాబు ఆద్యుడు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘100 రోజుల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రూ.40వేల కోట్ల అప్పులు చేశారు. నేరాలు దారుణంగా పెరిగిపోయాయి. మిగతా 1725 రోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు కష్టాలు, రాష్ట్ర విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 22, 2025

రాముడికి సోదరి ఉందా?

image

దశరథుడికి, కౌసల్యా దేవికి రాముడు జన్మించక ముందే శాంత అనే పుత్రిక పుట్టినట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం.. కౌసల్య సోదరి వర్షిణి, అంగ దేశపు రాజైన రోమపాద దంపతులకు శాంతను దత్తత ఇచ్చారు. ఈమె అంగ దేశపు యువరాణిగా పెరిగారు. లోక కార్యం కోసం ఆమె గొప్ప తపస్వి అయిన శృంగ మహర్షిని వివాహం చేసుకున్నారు. ఆ మహర్షే అయోధ్యలో పుత్ర కామేష్టి యాగం నిర్వహించి రామలక్ష్మణుల జననానికి కారణమయ్యారు.

News November 22, 2025

కూలుతున్న ‘క్రిప్టో’.. భారీగా పతనం

image

ఆకాశమే హద్దుగా ఎగిసిన క్రిప్టోకరెన్సీ అంతే వేగంగా దిగివస్తోంది. కొన్నాళ్లుగా వాటి విలువలు పడిపోతున్నాయి. క్రిప్టో రారాజు బిట్ కాయిన్ వాల్యూ ఈ నెలలో 25 శాతం పతనం కావడం గమనార్హం. 2022 జూన్ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఈ నెల మొదట్లో 1.10 లక్షల డాలర్లుగా ఉన్న విలువ నిన్న 7.6 శాతం తగ్గి 80,553 డాలర్లకు చేరింది. మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల కంటే కిందికి పడిపోయింది.

News November 22, 2025

విభూతి మహిమ

image

ఓనాడు ఓ విదేశీయుడు శివాలయం వద్ద 2 విభూది ప్యాకెట్లు కొన్నాడు. వాటిని అమ్మే బాలుడితో దాని ఎక్స్‌పైరీ డేట్ ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు ‘విభూతికి ఏ గడువూ ఉండదు. దీన్ని మీరు రోజూ నుదిటిపై ధరిస్తే మీ ఎక్స్‌పైరీ డేట్ పెరుగుతుంది’ అని జవాబిచ్చాడు. సాక్షాత్తూ ఆ శివుడి ప్రసాదం అయిన విభూతికి నిజంగానే అంత శక్తి ఉందని నమ్ముతారు. విభూతి ధరిస్తే.. శివుని కృపకు పాత్రులవుతారని, ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం.