News December 30, 2024
6 నెలల్లో చంద్రబాబు అప్పు రూ.1.12 లక్షల కోట్లు: వైసీపీ
AP: రాష్ట్రాన్ని అప్పుల కుప్పపై కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్నావా చంద్రబాబూ? అని వైసీపీ ప్రశ్నించింది. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే 6 నెలల్లో రూ.1,12,750 కోట్ల అప్పు చేశారని విమర్శించింది. ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వ గ్యారంటీతో పౌర సరఫరాల సంస్థ పేరుతో, ఏపీఎండీసీ, రాజధాని పేరుతో అప్పులు చేసిందంటూ ఓ పోస్టర్ను షేర్ చేసింది. ఇక మిగిలిన నాలుగున్నరేళ్లలో ఎంత అప్పు చేస్తుందో? అని ఎద్దేవా చేసింది.
Similar News
News January 2, 2025
ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు
AP: చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్కు, అమరావతిలో రూ.2,733 కోట్ల పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు భవన నిర్మాణాలు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచడం, పత్తిపాడులో 100 పడకల ఈఎస్ఐ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
News January 2, 2025
అదే జరిగితే NDA బలం 301కి జంప్
మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి! చీలిపోయిన NCPని మళ్లీ ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే జరిగితే లోక్సభలో NDAకు కొత్తబలం రావడం ఖాయం. ప్రస్తుతం ఈ కూటమికి 293 ఎంపీలు ఉన్నారు. INDIA కూటమిలోని NCP SPకి 8 మంది సభ్యులున్నారు. NCP కలిస్తే వారంతా అధికార పక్షం వైపు వస్తారు. దీంతో NDA బలం 301కి పెరుగుతుంది. చెరకు రైతుల సమస్యలంటూ ఈ మధ్యే మోదీతో శరద్ పవార్ ప్రత్యేకంగా భేటీ అవ్వడం గమనార్హం.
News January 2, 2025
ఈడీ విచారణకు హాజరుకాని బీఎల్ఎన్ రెడ్డి
TG: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు మరి కొంత గడువు కావాలని ఈడీకి మెయిల్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలోనే మరో తేదీని వెల్లడిస్తామన్నారు.