News September 29, 2024
చంద్రబాబుది నీచ రాజకీయం: వెల్లంపల్లి

AP: తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని CM చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని YCPనేత వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లడ్డూలో కల్తీ జరిగితే ఇన్ని రోజులు ఎందుకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు? శ్రీవారికి అపచారం జరిగితే PSలో కంప్లైంట్ ఇచ్చి ఊరుకుంటారా? వేంకటేశ్వరస్వామిపై మీ భక్తి ఇదేనా? వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్’ అని ఆయన ఆరోపించారు.
Similar News
News January 24, 2026
నేడు నగరిలో చంద్రబాబు పర్యటన

AP: నేడు CM చంద్రబాబు చిత్తూరు(D) నగరిలో పర్యటించనున్నారు. 11AMకు నగరి జూ. కాలేజ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడే ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. తర్వాత శాప్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రజా వేదికలో పాల్గొంటారు. అక్కడ స్వచ్ఛ రథాలను ప్రారంభిస్తారు. అనంతరం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో TDP శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం తిరుగు పయనమవుతారు.
News January 24, 2026
డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

డెయిరీ ఫామ్ ప్రారంభానికి ముందు కొంత భూమిలో నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భూమిలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ పశుగ్రాసాలను సాగుచేయాలి. సుబాబుల్, అవిసె చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్లు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు నిపుణులు. అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.
News January 24, 2026
IRELలో 30 పోస్టులకు నోటిఫికేషన్

కేరళలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (<


