News June 10, 2024
కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు
AP: ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు కేబినెట్ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. జిల్లాలు, సామాజిక వర్గాలు, సీనియర్ MLAలు ఇలా పలు అంశాల వారీగా మంత్రులుగా అవకాశం కల్పించాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. తమకు అవకాశం కల్పించాలని పలువురు ఆశావహులు ఉండవల్లిలోని CBN ఇంటికి క్యూ కడుతున్నారు. అటు జనసేనకు 5 పదవులు దక్కే ఛాన్సుంది.
Similar News
News January 12, 2025
భోగి మంటల్లో వీటిని వేస్తున్నారా?
సంక్రాంతి పండుగలో భాగంగా భోగి మంటలు వేయడం ఆనవాయితీ. హోమాన్ని ఎంత పవిత్రంగా భావిస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా భావించాలి. శుచిగా ఉన్న వ్యక్తి కర్పూరంతో భోగి మంట వెలిగించాలి. భోగి మంటల్లో పనికిరాని వస్తువులు, విరిగిన కుర్చీలు, టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, పెట్రోల్, కిరోసిన్ వేయకూడదు. చెట్టు బెరడు, పిడకలు, కొబ్బరి ఆకులు, ఎండిన కొమ్మలు, ఆవు నెయ్యి, ఔషధ మొక్కలు వంటి వాటితో మండించాలి.
News January 12, 2025
కరుణ్ నాయర్ మళ్లీ సెంచరీ
విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ <<15055540>>కరుణ్ నాయర్<<>> ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాయర్ (122*) మరో సెంచరీ బాదారు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. 82 బంతుల్లోనే 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. నాయర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో విదర్భ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
News January 12, 2025
హింసా రాజకీయాలకు సీఎం రేవంత్ ప్రోత్సాహం: హరీశ్ రావు
TG: INC ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసిందని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. ప్రజలు ఆరు గ్యారంటీలను ప్రశ్నించకుండా ఉండేందుకు CM రేవంత్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రైతు కూలీలు, అన్ని రకాల వడ్లకు బోనస్, రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా స్పందించడం లేదని ఫైరయ్యారు. ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు కూడా రైతు కూలీలేనని, వారికి కూడా రూ.12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.