News June 12, 2024

చంద్రబాబు తొలి సంతకం దేనిపై చేస్తారో?

image

AP: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం ఏ అంశంపై చేస్తారోననే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.4వేలకు, దివ్యాంగులకు రూ.6వేలకు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలుపైనా సైన్ చేసే అవకాశం ఉందంటున్నాయి.

Similar News

News September 12, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్: సీఎం రేవంత్
* నేపాల్ నుంచి స్వస్థలాలకు చేరుకున్న ఏపీ వాసులు
* ఏపీలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
* కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారు: సజ్జల
* ఈనెల 15 నుంచి చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు
* గ్రూప్-1పై జుడీషియల్ కమిషన్ వేయాలి: కేటీఆర్

News September 12, 2025

బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో టీటీడీ ఈవో భేటీ

image

AP: బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ అధికారులకు సూచించారు. ఈ వేడుకల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలని చెప్పారు. రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని తెలిపారు. 3,500 మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని, మెట్ల మార్గాల్లో భద్రత మరింత పటిష్ఠం చేయాలని దిశానిర్దేశం చేశారు.

News September 11, 2025

నక్సలైట్లందరూ సరెండర్ అవ్వాలి: అమిత్ షా

image

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్లో 10 మంది నక్సలైట్లు మరణించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ‘CRPF కోబ్రా కమాండర్స్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, DRG జాయింట్ ఆపరేషన్ చేపట్టి 10 మంది నొటోరియస్ నక్సలైట్లను హతమార్చారు. రూ.కోటి బౌంటీ ఉన్న CCM మోడెమ్ బాలకృష్ణ అలియాస్ మనోజ్‌ను కూడా మట్టుబెట్టారు. మిగిలిన నక్సలైట్లందరూ గడువులోగా లొంగిపోవాలి. మార్చి 31లోపు రెడ్ టెర్రర్‌ను ఏరివేయడం ఖాయం’ అని ట్వీట్ చేశారు.