News October 29, 2024

చంద్రబాబు చరిత్ర అదే: వైసీపీ

image

AP: గతంలో ఛార్జీలు పెంచడం అన్యాయమన్న ప్రజలపై బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించి, తుపాకీలతో కాల్చిన చరిత్ర చంద్రబాబుదని వైసీపీ విమర్శించింది. ఆయనకు ప్రజలంటే లెక్కలేదని, ప్రశ్నిస్తే కాల్చి పారేస్తాడని ట్వీట్ చేసింది. ఆనాడు జనరల్ డయ్యర్, నేడు చంద్రబాబు ఒక్కటేనని పేర్కొంది. 4 నెలలకే CBN పాలన ఇలా ఉంటే నాలుగేళ్లు ఎలా భరించాలని ప్రజలు బాధపడుతున్నారని రాసుకొచ్చింది.

Similar News

News October 31, 2024

హామీలెందుకు నెరవేర్చలేకపోతున్నారు: కూనంనేని

image

TG: ఎన్నికల హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు. మూసీ పునరుద్ధరణపై విదేశాల్లో అధ్యయనానికి ముందు ఇక్కడి ప్రజల పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. వారికి నిధుల చెల్లింపులో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ BJP, BRS రహస్య అజెండాతో ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

News October 31, 2024

అక్టోబర్ 31: చరిత్రలో ఈరోజు

image

✒ 1875: సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం. ఆయన జయంతిని కేంద్రం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతోంది.
✒ 1895: భారత క్రికెట్ టీం తొలి కెప్టెన్ సీకే నాయుడు జననం
✒ 1975: సంగీత దర్శకుడు ఎస్‌డీ బర్మన్ కన్నుమూత
✒ 1984: బాడీగార్డుల చేతిలో ఇందిరాగాంధీ హత్య
✒ 2008: ప్రాచీన భాషల్లో తెలుగును చేర్చిన కేంద్ర ప్రభుత్వం
✒ 1943: కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ జననం
✒ 2022: పారిశ్రామికవేత్త జేజే ఇరానీ మరణం

News October 31, 2024

‘భారత్-చైనా’ విమాన సర్వీసులు.. డ్రాగన్ రాయబారి ఏమన్నారంటే?

image

తూర్పు లద్దాక్‌లో బలగాల ఉపసంహరణ కొలిక్కి రావడంపై భారత్‌లోని చైనా రాయబారి షు ఫీహాంగ్ స్పందించారు. ఈ పరిణామం ఇరుదేశాల సంబంధాలను సులభతరం, బలోపేతం చేస్తుందని చెప్పారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ-జిన్‌పింగ్‌లు ముఖ్యమైన అంశాలపై అవగాహనకు వచ్చారని తెలిపారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం తాను ఎదురుచూస్తున్నానన్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.