News March 31, 2024

వాలంటీర్లపై చంద్రబాబు కపట ప్రేమ: కారుమూరి

image

AP: చంద్రబాబు, ఆయన తోక పార్టీకి ఏనాడూ వాలంటీర్లు అంటే ఇష్టం లేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి లేఖ రాయించి వాలంటీర్ల సేవలను నిలిపివేయించారని దుయ్యబట్టారు. ‘ప్రజలకు మేలు చేసేది ఏదైనా బాబుకి నచ్చదు. పెన్షన్ల కోసం వృద్ధులు ఎండలో నిలబడి సొమ్మసిల్లి పడిపోతే ఆయనకు సంతోషం. వాలంటీర్లపై చంద్రబాబు కపట ప్రేమ నేడు బయటపడింది’ అంటూ విరుచుకుపడ్డారు.

Similar News

News October 6, 2024

ఫోక్ సింగర్‌కు హైకోర్టులో ఊరట

image

TG: యువతిపై లైంగికదాడికి యత్నించారనే కేసులో ఫోక్ సింగర్, రైటర్ మల్లిక్ తేజకు ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. డబ్బుల కోసమే తనను యువతి ఇబ్బందులకు గురి చేసిందని మల్లిక్ పేర్కొన్నారు. మల్లిక్‌పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది అన్నారు.

News October 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 6, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 6, ఆదివారం
శు.తదియ: ఉదయం 7.49 గంటలకు
విశాఖ: రాత్రి 12.11 గంటలకు
వర్జ్యం: ఉదయం 4.33 గంటలకు
దుర్ముహూర్తం: సా.4.16-5.04 గంటల వరకు