News March 21, 2024

ఏపీ ప్రతిష్ఠపై బురదజల్లడమే చంద్రబాబు పని: YCP

image

AP: ఎక్కడేం జరిగినా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి ఏపీ ప్రతిష్ఠపై బురదజల్లడమే చంద్రబాబు పని అని YCP విమర్శించింది. ‘విశాఖలో దొరికిన డ్రగ్స్ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ సంస్థకు చెందినది. దాని ఎండీ కూనం వీరభద్రరావు కాగా డైరెక్టర్ కూనం కోటయ్య చౌదరిగా గుర్తించారు. ఇప్పుడు చెప్పు చంద్రబాబూ.. వీళ్లు మీ పార్టీకి చెందినవారు కాదా? వీళ్లు ఎవరికి బంధువులు? నీకా నీ కొడుక్కా?’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

Similar News

News September 13, 2025

IPSల బదిలీలు.. ఈ జిల్లాలకు కొత్త ఎస్పీలు

image

AP: ఏపీ ప్రభుత్వం ఐపీఎస్‌లను బదిలీ చేసింది. గుంటూరు-వకుల్ జిందాల్, పల్నాడు-డి.కృష్ణారావు, ప్రకాశం-హర్షవర్ధన్ రాజు, చిత్తూరు-తుషార్ డూడీ, సత్యసాయి-సతీశ్ కుమార్, కృష్ణా-విద్యాసాగర్ నాయుడు, విజయనగరం-ఏఆర్ దామోదర్, నంద్యాల-సునీల్ షెరాన్, అంబేడ్కర్ కోనసీమ- రాహుల్ మీనా, కడప-నచికేత్, అన్నమయ్య-ధీరజ్ కునుగిలి, తిరుపతి-సుబ్బారాయుడు, నెల్లూరు-అజితా వేజెండ్ల, బాపట్ల-ఉమామహేశ్వర్‌ను నియమించింది.

News September 13, 2025

తగ్గిన సబ్బులు, షాంపూల ధరలు

image

GST సవరణ నేపథ్యంలో ప్రముఖ FMCG బ్రాండ్ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తమ ఉత్పత్తుల ధరలు తగ్గించింది. రూ.490 ఉండే డవ్ షాంపూ(340ml) రూ.435కే లభించనుంది. రూ.130 హార్లిక్స్ జార్(200g) రూ.110, రూ.68 లైఫ్‌బాయ్ సబ్బు(75gX4) రూ.60, రూ.96 లక్స్ సబ్బు(75gX4) రూ.85, రూ.300 బ్రూ (75g) రూ.284, రూ.124 బూస్ట్(200g) రూ.110, రూ.154 క్లోజప్ (150g) రూ.129కే అందుబాటులో ఉంటాయి. ఈ నెల 22 నుంచి ఈ ధరలు అమలవుతాయి.

News September 13, 2025

హైదరాబాద్ మిధానీలో ఉద్యోగాలు

image

HYDలోని మిశ్ర ధాతు నిగమ్<>(మిధాని<<>>) 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 24వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్/బీఈలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత, కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.