News January 4, 2025

రేపటి నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపటి నుంచి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. ఈ పర్యటనలో సీఎం పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం రాకతో కుప్పంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Similar News

News October 30, 2025

BIG ALERT: నేడు భారీ వర్షాలు

image

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. అటు ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడవచ్చని వెల్లడించింది.

News October 30, 2025

బాలింతల ఆహారంలో ఇవి ఉన్నాయా?

image

గర్భం దాల్చినప్పటి బిడ్డకు రెండేళ్లు ముగిసేవరకు మహిళలకు అదనపు పోషకాలు అందించాలంటున్నారు నిపుణులు. ఇవే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదలకు తోడ్పడుతుంది. అందుకే బాలింతలు మొదటి 6నెలలు రోజువారీ ఆహారంలో 600 క్యాలరీలు, 13.6 గ్రా ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలంటున్నారు. 6-12 నెలల మధ్యలో 520 క్యాలరీలు, 10.6గ్రా ప్రొటీన్‌ తీసుకోవాలి. వీటితో పాటు ప్రతిరోజూ 290mg అయోడిన్, 550mg కోలిన్ తీసుకోవాలంటున్నారు.

News October 30, 2025

తిరుమలలో మరిన్ని శాశ్వత క్యూలైన్లు

image

AP: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. SSD టోకెన్లు కలిగిన భక్తుల కోసం తిరుమలలోని ఏటీజీహెచ్ అతిథి గృహం సమీపంలో నూతన షెడ్లు, క్యూలైన్ల మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించింది. బాటగంగమ్మ ఆలయం నుంచి గోగర్భం జలాశయం కూడలి వరకు 3కి.మీ మేర రూ.17.60 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించనుంది. భక్తుల రద్దీని దృష్టిని ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.