News May 3, 2024

ఉద్యోగులు, టీచర్లకు చంద్రబాబు లేఖ

image

AP: ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షనర్లు, టీచర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ‘ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులు చూశాను. జీతాలు రాక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. హక్కుల కోసం ఉద్యమిస్తే కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పీఆర్సీ తెచ్చారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని మోసగించారు. ఉద్యోగులు భయపడకుండా ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

Similar News

News April 8, 2026

HYD: 2 BHK కాలనీల్లో వేలానికి షాపులు

image

క్యూర్ పరిధిలోని 36 2BHK కాలనీల్లోని 1,400 పైగా దుకాణాల వేలానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రంగారెడ్డి: APR 9, 10న 8 కాలనీల్లోని 273 షాపులు, హైదరాబాద్: APR 15, 16న 10 కాలనీల్లోని 77 షాపులు, మేడ్చల్: ఏప్రిల్ 15, 17న 12 కాలనీల్లోని 892 షాపులు, సంగారెడ్డి: ఏప్రిల్ 15 నుంచి 18, తిరిగి 21న 6 కాలనీల్లోని 372 షాపులకు వేలం వేస్తారు. ఆసక్తి గలవారు నిర్ణీత EMDతో RDO కార్యాలయాల్లో రిజిస్టర్ చేసుకోవాలి.

News April 8, 2026

హార్ముజ్‌పై టోల్స్ విధిస్తే ఒప్పుకోం: ఒమన్

image

హార్ముజ్ జలసంధిపై టోల్స్ విధించేందుకు అనుమతించాలన్న ఇరాన్ సీజ్‌ఫైర్ డిమాండ్‌ను పొరుగు దేశమైన ఒమన్ తప్పుపట్టింది. అది అంతర్జాతీయ జలమార్గమని దానిపై ఫీజు వసూలు చేయడం సరికాదని ఒమన్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పేర్కొన్నారు. దీనిపై గతంలో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు తెలిపారు. కాగా అంతకుముందు హార్ముజ్‌పై టోల్స్‌కు ఇరాన్, ఒమన్ అంగీకరించాయని ఇరాన్ మీడియా పేర్కొంది.

News April 8, 2026

సీజ్‌ఫైర్ వేళ.. UAE, కువైట్‌పై ఇరాన్ దాడి

image

తమ దేశంలోని లవన్ రిఫైనరీపై దాడికి ప్రతీకారంగా UAE, కువైట్‌పై ఇరాన్ విరుచుకుపడింది. మిడిల్ ఈస్ట్‌లోని ఆ రెండు దేశాలపై మిస్సైల్స్‌ ప్రయోగించింది. ఒకవైపు సీజ్‌ఫైర్ అమల్లో ఉండగానే తమపై దాడి జరిగిందని ఇరాన్ చెప్తోంది. అందుకే అమెరికాకు మద్దతిస్తున్న గల్ఫ్ దేశాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది.