News May 11, 2024

సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో: సీఎం జగన్

image

AP: 59 నెలలుగా లంచాలు, వివక్ష లేకుండా పాలన చేశామని సీఎం జగన్ చెప్పారు. కైకలూరు సభలో మాట్లాడుతూ.. ‘సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా? ఈ ఐదేళ్లూ ఇంటి వద్దకే పౌర సేవలను అందించాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో ఇచ్చారు. ఆయనను నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News November 22, 2025

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని జీవోలో స్పష్టం చేసింది. SC, ST, BC, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనుంది. ST రిజర్వేషన్లు ఖరారయ్యాక SC, BC రిజర్వేషన్లు ఉంటాయి. రేపు సా.6 గంటల్లోపు ఖరారు చేసిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు అందించనున్నారు.

News November 22, 2025

ఇంజినీరింగ్ విద్యార్థినులకు JNTU హైదరాబాద్ గొప్ప అవకాశం

image

బీటెక్​ చదివిన ప్రతి విద్యార్థినికి ఉద్యోగం రావాలని JNTU హైదరాబాద్​ అధికారులు కొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చారు. క్యాంపస్​ ఇంటర్వ్యూల్లో కొద్దిపాటి తేడాతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన విద్యార్థినులకు ఆరు నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించేందుకు సాయం చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరులోని ఎమర్టెక్స్​ అనే ఐటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. JNTUలో చదివితే ఉద్యోగం ఖాయం అనే ధీమాను కల్పిస్తున్నారు.

News November 22, 2025

IIITకల్యాణిలో నాన్ టీచింగ్ పోస్టులు

image

IIITకల్యాణి, పశ్చిమబెంగాల్‌లో 6 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, CA/ICWA, ME, M.Tech, MSc, MCA, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iiitkalyani.ac.in