News July 4, 2024
మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర కీలక అంశాలపై మోదీకి సీఎం వినతి పత్రాలు సమర్పించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై చర్చించినట్లు సమాచారం. దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది.
Similar News
News January 16, 2025
హిండెన్‌బర్గ్‌ను ఇప్పుడే ఎందుకు మూసేసినట్టు!
US షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ షట్‌డౌన్ టైమింగ్‌పై చాలామందికి డౌట్ వస్తోంది. JAN 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. కొన్ని రోజుల క్రితమే హౌస్ జుడీషియరీ కమిటీలోని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడొకరు అదానీ, అతడి కంపెనీలపై కమ్యూనికేషన్, దర్యాప్తు పత్రాలు, ఆధారాలన్నీ పరిరక్షించాలని DOJను కోరారు. ఇక హిండెన్‌బర్గ్‌కు డీప్‌స్టేట్, డెమోక్రాట్స్, జార్జ్ సొరోస్, చైనా ఇంటెలిజెన్స్ సహకారంపై ఆరోపణలు ఉన్నాయి.
News January 16, 2025
రూ.1,00,00,000 ప్రశ్న.. జవాబు చెప్పగలరా?
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ క్రికెట్‌కు సంబంధించి రూ.కోటి ప్రశ్న వేశారు. 1932లో లార్డ్స్‌లో భారత్ ఆడిన తన తొలి టెస్టులో మొదటి బంతి ఎదుర్కొన్న బ్యాటర్ ఎవరు? అని క్వశ్చన్ అడిగారు. A.జనార్దన్ నవ్లే B.సోరాబ్జీ కోలాహ్ C.లాల్ సింగ్ D.ఫిరోజ్ పలియా అని ఆప్షన్స్ ఇచ్చారు. మరి మీరు సరైన సమాధానం ఏంటో చెప్పగలరా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్: A.
News January 16, 2025
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉ.11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపునకు ఆమోద ముద్ర వేసే అవకాశమున్నట్లు సమాచారం.