News June 30, 2024

14 ఏళ్లలో ఒక్కరోజైనా ఇంటి వద్దకే చంద్రబాబు పింఛను పంపించారా?: వైసీపీ

image

AP: ప్రతి నెలా 1, 2 తేదీల్లో పెన్షన్ తీసుకోకుంటే అనర్హులవుతారని YCP దుష్ప్రచారం చేస్తోందన్న TDP <<13537125>>విమర్శలకు<<>> ఆ పార్టీ కౌంటరిచ్చింది. ‘అవ్వాతాతలను ఏడిపించింది ఎవరో అందరికీ తెలుసు. జగనన్న హయాంలో పండుటాకులకు కష్టం కలగకుండా గడప వద్దే పింఛను అందించాం. 14ఏళ్లలో ఒక్కరోజైనా ఇంటి వద్దకే CBN పింఛను పంపించారా? పింఛనుదారులకు డబ్బు ఎగ్గొట్టడానికేగా ఈ డప్పు ప్రచారం!’ అని Xలో మండిపడింది.

Similar News

News April 9, 2026

75% పోలింగ్.. అదరగొడుతున్న అస్సాం ఓటర్లు!

image

అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి అస్సాంలో 75.91% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు కేరళంలో 62.71%, పుదుచ్చేరిలో 72.40% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్‌లోకి ఎంట్రీ ఉంది. కాగా 2021 ఎన్నికల్లో అస్సాంలో 82.42%, కేరళంలో 74.06%, పుదుచ్చేరిలో 83.42% పోలింగ్ నమోదైంది.

News April 9, 2026

సైంధవుడిలా అడ్డుకోవడమంటే?

image

ఎవరైనా ఓ పనిని ముందుకు సాగనీయకపోతే సైంధవుడిలా అడ్డుకున్నాడని అంటాం. దుర్యోధనుడి సోదరి దుస్సల భర్తే సైంధవుడు(జయద్రథుడు). వనవాసంలో ద్రౌపదిని అతను అవమానిస్తే భీముడు చావగొడతారు. ఆ పగతో తపస్సు చేసి ఒక్కరోజైనా పాండవులను అడ్డగించేలా శివుడిని వరం కోరతారు. అర్జునుడిని మినహాయించి ఈశ్వరుడు ఈ వరమిస్తారు. యుద్ధంలో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్లాక ఇతర పాండవులు అనుసరించకుండా సైంధవుడు అడ్డుపడతారు.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 9, 2026

మావిగన్ జోకర్‌గా జగన్: షర్మిల

image

AP: YCP చీఫ్ <<19603764>>జగన్<<>> YSR పేరును వాడుకున్నారే తప్ప ఆయన ఆశయాలకు వారసులు కాలేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. ‘‘దేశంలో క్రిస్టియన్ మైనారిటీలపై దాడులు జరుగుతుంటే YSR వారసుడుగా జగన్ ఎందుకు ఖండించలేదు? 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్‌లు కట్టుకున్నారు. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’గా మిగిలారు. మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి ‘ఓన్లీ క్యాష్’ మాఫియా ఎందుకు చేశారు’’ అని నిలదీశారు.