News March 24, 2024
డ్రగ్స్ వెనుక చంద్రబాబు బంధువులున్నారు: సజ్జల

వైజాగ్లో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఏపీ చీఫ్ పురందీశ్వరి సంబంధీకులు ఉన్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఆరోపించారు. ‘దీనిపై సీబీఐ సహా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు తీరు దొంగే దొంగా అని అరిచినట్లుగా ఉంది. పురందీశ్వరి తనయుడు కూడా ఆ కంపెనీలో వాటాదారుడే. డ్రగ్స్ కేసులో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు మాకు అనుమానాలున్నాయి’ అని సజ్జల పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
జాతీయవాదం వల్లే యుద్ధాలు: మోహన్ భాగవత్

ప్రపంచ సమస్యలకు సమాధానాలు అందించే తెలివి, ఆలోచన ఇండియాకు ఉన్నాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ‘జాతీయవాదం కారణంగానే యుద్ధాలు జరుగుతాయి. అందుకే ప్రపంచ నేతలు అంతర్జాతీయవాదం గురించి మాట్లాడటం ప్రారంభించారు. కానీ తమ దేశ ప్రయోజనాలనే ప్రధానంగా చూసుకుంటారు’ అని చెప్పారు. జైపూర్లో నిర్వహించిన దీన్ దయాళ్ స్మృతి ఉపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
News November 16, 2025
200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు: వైభవ్

యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్తో చెలరేగుతున్న విషయం తెలిసిందే. UAEపై వీర విహారం చేసి 32 బంతుల్లోనే <<18287840>>సెంచరీ<<>> నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి గురించి వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను 200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు. ఇంకో 10 రన్స్ చేసి ఉండేవాడినని అంటారు. అమ్మ మాత్రం సెంచరీ చేసినా, డకౌట్ అయినా సంతోషంగానే ఉంటుంది. బాగా ఆడమని చెబుతుంది’ అని BCCI ఇంటర్వ్యూలో చెప్పారు.
News November 16, 2025
నవంబర్ 16: చరిత్రలో ఈరోజు

* 1966: జాతీయ పత్రికా దినోత్సవం * 1908: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం. * 1923: తెలుగు సినీ నటుడు కాంతారావు జననం.(ఫొటోలో) * 1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం. * 1973: తెలుగు, తమిళ సినీ నటి ఆమని జననం. * 1973: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం. * 1983: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ జననం (ఫొటోలో).


