News July 7, 2024
TTDP నేతలతో నేడు చంద్రబాబు సమీక్ష

TG: తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపైనా చర్చిస్తారని సమాచారం. టీటీడీపీ అధ్యక్షుడిని CBN ఈరోజు ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలంటున్నాయి.
Similar News
News November 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 73

ప్రశ్న: యుద్ధంలో ఓడిపోతాం అనే భయంతో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్లి ‘మీరు పాండవులపై ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదు’ అని నిందిస్తాడు. అప్పుడు భీష్ముడు 5 బాణాలిచ్చి, వీరితో పంచ పాండవుల ప్రాణాలు తీయవచ్చు అని చెబుతాడు. మరి ఆ బాణాల నుంచి పాండవులు ఎలా తప్పించుకున్నారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 21, 2025
అక్టోబర్లో ట్యాక్స్ రెవెన్యూ రూ.16,372 కోట్లు

TG: అక్టోబర్లో రాష్ట్ర ఖజానాకు అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్లు సమకూరినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఎక్సైజ్ సుంకాల ద్వారానే రూ.3,675Cr వచ్చినట్లు పేర్కొంది. అక్టోబర్ రెవెన్యూతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఖజానాకు చేరిన మొత్తం రూ.88,209.10Crకు పెరిగింది. FY26లో పన్నుల కింద మొత్తం రూ.1,75,319.35Cr వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, ఇప్పటివరకు 50.31% సమకూరింది.
News November 21, 2025
సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనుగోలు చేయొచ్చు

AP: శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన బాబా స్మారక రూ.100 నాణేలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఆసక్తిచూపుతున్నారు. https://www.indiagovtmint.inలో మాత్రమే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280. నాణెంతోపాటు ఆయన జీవిత విశేషాల బుక్లెట్ కూడా అందుతుంది. ఆన్లైన్ పేమెంట్తో బుక్ చేసుకున్న నెల రోజుల్లోపు వీటిని ఇంటికి పంపుతారు.


