News May 3, 2024
చంద్రబాబు సూపర్-6లో రూ.4వేల పెన్షన్ మాయం: సీఎం జగన్

AP: చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి తిరిగొస్తుందని CM జగన్ చెప్పారు. ఆయన ఇప్పుడే సూపర్-6లో రూ.4,000 పెన్షన్ హామీని ఎత్తేశారని మండిపడ్డారు. కనిగిరి సభలో మాట్లాడుతూ.. ‘మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి, కాపు నేస్తం, EBC నేస్తం, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కళ్యాణమస్తు, షాదీతోఫా, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ అందుతాయి. విలేజ్ క్లినిక్లో వైద్యం, ఇంటికే పౌర సేవలు కొనసాగుతాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: పొంగులేటి

TG: కాంగ్రెస్ పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తొలుత సర్పంచ్ ఎలక్షన్లు DECలనే నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చితో రూ.3వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉండటంతో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. HC తీర్పు అనంతరం MPTC, ZPTC ఎన్నికలకు వెళ్తామన్నారు.

పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’: పొంగులేటి

TG: ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ రుణాన్ని ఉడతాభక్తిగా తీర్చుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం ఇస్తామన్నారు. అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రతి పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని ముద్రిస్తామని వెల్లడించారు.