News May 3, 2024
చంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి: సీఎం జగన్
AP: 57 నెలలుగా పెన్షన్లను అవ్వాతాతల ఇంటి వద్దే అందించామని CM జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు పాపిష్టి కళ్లు వారిపై పడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. కనిగిరి సభలో మాట్లాడుతూ.. ‘వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయొద్దని తన మనిషి నిమ్మగడ్డతో చంద్రబాబే ECకి ఫిర్యాదు చేయించారు. కడుపు మంట చల్లారక వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేశారు. మేం అధికారంలోకి రాగానే ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తాం’ అని చెప్పారు.
Similar News
News December 26, 2024
బాక్సింగ్ డే టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట
బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి AUS 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఆసీస్ టాపార్డర్లో నలుగురు బ్యాటర్లు అర్ధసెంచరీలు చేశారు. స్మిత్(68*), కమిన్స్(8*) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3, ఆకాశ్ దీప్, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. తొలి రోజే 87,242 మంది అభిమానులు హాజరయ్యారని, ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికమని క్రీడా వర్గాలు తెలిపాయి.
News December 26, 2024
వైకుంఠద్వార దర్శనం.. 9 చోట్ల టికెట్ల జారీ!
మార్చి-2025 నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయగా క్షణాల్లో బుక్ అయిపోయాయి. వీటితో పాటు వైకుంఠద్వార దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్ల విడుదలపై ప్రకటన చేసింది. 2025 జనవరి 10-12 వరకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు అందజేస్తామని తెలిపింది. వీటిని జనవరి 8న ఉదయం 5 గంటలకు తిరుపతిలోని 9 ప్రదేశాల్లో అందజేస్తారు. కాగా, ఈ పది రోజుల్లో టోకెన్లు లేకుండా దర్శనానికి అనుమతించరు.
News December 26, 2024
గ్రూప్-1పై దాఖలైన అన్ని పిటిషన్ల కొట్టివేత
TG: గ్రూప్-1 పరీక్షకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. జీఓ నంబర్ 29, రిజర్వేషన్ అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వాదోపవాదాల అనంతరం వారి పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్-1 ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది.