News January 29, 2025

ఏపీ కోసం చంద్రబాబు కష్టాలు: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: ఏపీలో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌కు వచ్చే కంపెనీలను ఏపీ తీసుకెళ్లే ఆలోచన చంద్రబాబుకు లేదని చెప్పారు. ‘చంద్రబాబు హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఏపీకి గ్లోబల్ క్యాపబులిటీ ఉంది. ఆ రాష్ట్రానికి తీర ప్రాంతం, సహజ వనరులు అపారంగా ఉన్నాయి. ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 30, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,800 పతనమై రూ.1,24,850 పలుకుతోంది. అటు వెండి ధర ఏకంగా రూ.23వేలు తగ్గి కిలో రూ.2,58,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 30, 2025

నిమ్మలో గానోడెర్మా తెగులు – నివారణ

image

నిమ్మచెట్ల కాండంపై పుట్టగొడుగుల మాదిరిగా ఏర్పడి చెట్లు క్షీణించడాన్ని గానోడెర్మా తెగులు అంటారు. పుట్టగొడుగులు లాంటివి కాండంపై గుర్తిస్తే చాకుతో వాటిని తీసివేసి, కాల్చి వేయాలి. తర్వాత తెగులు సోకిన భాగాలపై బోర్డోపేస్టును పూయాలి. 1 శాతం బోర్డో మిశ్రమాన్ని లేదా లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. చొప్పున కలిపిన ద్రావణాన్ని పీచువేర్లు తరలించేటట్లు పాదుల్లో పోయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News December 30, 2025

పుతిన్ ఇంటిపై దాడి.. ‘నాకు చాలా కోపం వస్తోంది’ అన్న ట్రంప్!

image

పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయం తనతో పుతిన్ స్వయంగా చెప్పారన్నారు. ఇది చాలా తప్పని.. తనకు చాలా కోపం వస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే రష్యా చేస్తున్న ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కొట్టిపారేశారు. ఇవన్నీ అబద్ధాలని.. శాంతి చర్చలను పక్కదారి పట్టించేందుకే రష్యా ఇలాంటి డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.