News June 30, 2024

రేపు పెనుమాకలో చంద్రబాబు పర్యటన

image

AP: గుంటూరు జిల్లా పెనుమాకలో CM చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. ఉ.5.45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి 6 గంటలకు పెనుమాక చేరుకుంటారు. NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ST కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం పెనుమాక మసీదు సెంటర్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటించనున్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

Similar News

News December 13, 2025

గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరపాలి: కలెక్టర్

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌంటింగ్ సమయానికి ప్రారంభించి, ఎటువంటి జాప్యం లేకుండా ఫలితాలను వెల్లడించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.

News December 13, 2025

రెండు రోజుల్లో బుల్లెట్ నేర్చుకున్న బామ్మ

image

వయసులో ఉన్న అమ్మాయిలే బుల్లెట్ బండి నడపాలంటే అమ్మో అంటారు. కానీ చెన్నైకి చెందిన 60 ఏళ్ల లతా శ్రీనివాసన్ రెండు రోజుల్లో బుల్లెట్ బండి నడిపి ఔరా అనిపించారు. రిటైర్మెంట్ తర్వాత తనకిష్టమైన బైక్ రైడింగ్ నేర్చుకోవాలనుకున్న లత ఒక అకాడమీలో చేరారు. అక్కడ మొదటి రోజు క్లచ్.. గేర్ మార్చడం నేర్చుకుంది. రెండో రోజునే సెకండ్.. థర్డ్ గేర్‌లో స్మూత్‌గా బైక్ నడపడం మొదలుపెట్టి ట్రెండ్ సెట్టర్‌గా మారారు.

News December 13, 2025

నెలలో జరీబు భూముల సమస్యల పరిష్కారం: పెమ్మసాని

image

AP: అమరావతిలో జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల సమయం కోరామని కేంద్ర మంత్రి P.చంద్రశేఖర్ తెలిపారు. సాయిల్ టెస్ట్ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘రాజధాని గ్రామాల్లో శ్మశానాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పిస్తాం. ల్యాండ్ పూలింగ్‌లో ఇప్పటికీ 2,400 ఎకరాలను కొందరు రైతులు ఇవ్వలేదు. వారితో మరోసారి చర్చిస్తాం. భూసమీకరణ కుదరకపోతే భూసేకరణ చేస్తాం’ అని పేర్కొన్నారు.