News September 20, 2024

నేడు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. నాగులుప్పలపాడు మండలంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరు రోజులపాటు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది.

Similar News

News September 20, 2024

రెండో రోజు ఆట మొదలు

image

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. నిన్న 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసిన టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది. క్రీజులో సెంచరీ హీరో రవిచంద్రన్ అశ్విన్(102), జడేజా(86) ఉన్నారు. భారత్ ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

News September 20, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో వారికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. వారికి నోటీసులు ఇవ్వాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది. వారిద్దరినీ ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభాకర్ USలో చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించామని, శ్రవణ్ ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపారు. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు.

News September 20, 2024

బెంగాల్ X ఝార్ఖండ్: సరిహద్దు మూసేసిన మమత

image

ఝార్ఖండ్ సరిహద్దును మూసేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) వల్ల 5 లక్షల క్యూసెక్కుల వరద సౌత్ బెంగాల్లోని 11 జిల్లాలను ముంచేసిందని ఆమె ఆరోపించారు. DVC ఎప్పుడూ ఝార్ఖండ్ గురించే ఆలోచిస్తోందని, దాంతో సంబంధాలు తెంపుకుంటున్నామని ప్రకటించారు. ‘ఆమెదో విపరీత చర్య. బెంగాల్‌కు ధాన్యం తెచ్చే ట్రక్కులను మేమూ ఆపేస్తాం’ అని JMM హెచ్చరించింది.