News July 16, 2024
విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను మార్చండి: సీజేఐ

TG: విద్యుత్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి తీరుపై సీజేఐ చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కమిషన్ రద్దు పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆయన మాట్లాడారు. ప్రెస్మీట్లో ఛైర్మన్ ఒకరికి ప్రతికూలంగా ఉండొద్దని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కమిషన్ ఛైర్మన్‌ను మార్చే అవకాశం ప్రభుత్వానికి ఇస్తున్నామన్నారు. మరోవైపు ఛైర్మన్‌ను మారుస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.
Similar News
News November 21, 2025
పైరసీ కట్టడికి ప్రత్యేక వింగ్?

TG: సినిమాల పైరసీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇదే సమయంలో దానిపై ఉక్కుపాదం మోపేందుకు ఓ ప్రత్యేక వింగ్ పెట్టాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాల కట్టడికి ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు వివరించాయి. ఐ బొమ్మ రవి అరెస్టును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్న విషయం తెలిసిందే.
News November 21, 2025
నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
News November 21, 2025
నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం


