News August 2, 2024

టీజీ సెట్ పరీక్ష తేదీల్లో మార్పు

image

TG: రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 పరీక్ష తేదీలు మారాయి. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు పరీక్షలుంటాయి. దరఖాస్తులు ఎడిట్ చేసుకునేందుకు 23, 24 తేదీల్లో అవకాశం ఉంటుంది. UGC NET సవరించిన పరీక్షల షెడ్యూల్‌‌ను ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు.

Similar News

News November 13, 2025

ఆ సినిమాలు చూసి నన్ను చంపాలనుకున్నారు: అదా శర్మ

image

రిస్క్ ఉన్న క్యారెక్టర్లను ఎంపిక చేసుకుని, నటించినప్పుడే కెరీర్‌కు విలువ పెరుగుతుందని హీరోయిన్ అదా శర్మ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ది కేరళ స్టోరీ, బస్తర్: ది నక్సల్ స్టోరీ మూవీలు రిలీజైన తర్వాత బెదిరింపులు ఎదుర్కొన్నాను. దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు. మిగిలిన వారు ప్రశంసించారు. వాళ్లే నన్ను కాపాడారు. నేను యాక్షన్, భావోద్వేగం, రిస్క్ ఉన్న స్క్రిప్ట్‌నే ఎంపిక చేసుకుంటా’ అని చెప్పారు.

News November 13, 2025

CBN గారూ.. మీ ‘క్రెడిట్‌ చోరీ స్కీం’ చాలా బాగుంది: జగన్

image

AP: క్రెడిట్‌ చోరీలో మీకు మీరే సాటి అంటూ CM CBNపై YCP అధినేత జగన్ విమర్శలకు దిగారు. ‘YCP హయాంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను మేమే కట్టేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మీ క్రెడిట్‌ చోరీ స్కీం చాలా బాగుంది. 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లూ మంజూరు చేయించలేదు. 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరో 87వేల ఇళ్లు శ్లాబ్‌ లెవల్‌ వరకు కట్టించినవే’ అని ట్వీట్ చేశారు.

News November 13, 2025

వంటింటి చిట్కాలు

image

* కరివేపాకును ఎండబెట్టి పొడిచేసుకుని కూరల్లో వేసుకుని తింటే కమ్మటి వాసన వస్తుంది.
* తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు రావు.
* బియ్యం పురుగు పట్టకూడదంటే కరివేపాకులు వేయాలి.
* కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే త్వరగా పెరుగు పాడవదు.
* నెయ్యి పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి.
* చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడిపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది.