News July 12, 2024

అక్టోబర్ 18 నుంచి 4 రైళ్ల వేళల్లో మార్పు

image

OCT18 నుంచి సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ వేళలు మారుతాయని SCR ప్రకటించింది. SECBAD-గూడూరు సింహపురి(12710) రా.10.35కి బదులు రా.10.05కి బయల్దేరుతుంది. SECBAD-తిరుపతి పద్మావతి(12764) గూడూరును ఉ.4.43కి బదులు ఉ.4.19కి చేరుతుంది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి(12734) సా.6.25కి బదులు సా.5.30 స్టార్టవుతుంది. నర్సాపూర్-నాగర్‌సోల్(17231) రా.11.15కు బదులు రా.9.50కి బయల్దేరుతుంది.

Similar News

News November 22, 2025

వరంగల్: ‘సారథి’ సాగట్లే..!

image

సారథి పరివాహన్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు పెరుగుతుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, స్థాయి పెంపుదల, బ్యాడ్జ్‌ లైసెన్స్ అప్లికేషన్‌లకు డేటా కనిపించకపోవడం, రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోవడం వంటి సమస్యలు వరుసగా వస్తున్నాయి. రెండు నెలలుగా వెబ్‌సైట్ నూతనీకరణ తర్వాత పరిస్థితి ఇంకా చక్కదిద్దకపోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు

News November 22, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.

News November 22, 2025

భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.