News October 11, 2024
16 నుంచి ఇంటర్ కాలేజీల టైమింగ్స్ మార్పు

AP: ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.4 వరకు టైమింగ్స్ ఉండగా, ఈ నెల 16 నుంచి సా.5 వరకు సమయాన్ని పొడిగించింది. గత ఏడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతో సా.4-5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్ల ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపల్స్ను ఆదేశించారు.
Similar News
News November 3, 2025
శుభ కార్యాలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారు?

హిందూ ఆచారాల ప్రకారం.. శుభకార్యాల వేళ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతుంటారు. అయితే ఇది అలంకరణలో భాగమే కాదు. దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు పండితులు. ‘పండుగలు, శుభ కార్యాల వేళ ఇంటికి ఎక్కువ మంది వస్తుంటారు. వారి వల్ల కలుషితమైన గాలిని మామిడి ఆకులు శుద్ధి చేస్తాయి. ఈ ఆకుల నుంచి వచ్చే గాలిని పీల్చడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామిడి చెట్టు కల్పవృక్షం’ అని అంటున్నారు.
News November 3, 2025
వేప మందుల వాడకంలో మెళకువలు

వేప నూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు కీడుచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.
News November 3, 2025
పాపం దక్షిణాఫ్రికా

వైట్ బాల్ క్రికెట్లో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతోంది. వరల్డ్ కప్ గెలవాలనే కలకు మహిళల జట్టు కూడా అడుగుదూరంలోనే ఆగిపోయింది. ఫైనల్లో ఓటమితో ఆ జట్టుకు వరల్డ్ కప్ ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ ఏడాది మెన్స్ జట్టు WTC విజేతగా నిలిచినా గత ఏడాది T20WC ఫైనల్లో ఓటమి, తాజాగా WWC ఫైనల్లో ఓటమి ఆ దేశ ఫ్యాన్స్ను మరోసారి నిరాశకు గురిచేశాయి.


