News April 1, 2025
వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

AP: వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉ.5.30 గంటలకే బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు వేసవిలో రద్దీని దృష్టిలో పెట్టుకొని సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.
Similar News
News April 2, 2025
CM రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

TG: MLAల అనర్హత కేసు విచారణ సందర్భంగా CM రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపఎన్నికలు రావని అసెంబ్లీలో ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ‘ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో CM ప్రకటిస్తే అది రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేయడమే. అవసరమైతే దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని CMకు హితవు చెప్పాలి’ అని స్పీకర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
News April 2, 2025
‘విశ్వంభర’ కోసం సింగర్‌గా మారిన మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈక్రమంలో అంచనాలు మరింత పెంచేందుకు మెగా గాత్రాన్ని వాడుకునేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సినిమాలో ఓ పాట పాడేందుకు చిరు ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అప్డేట్ రానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
News April 2, 2025
రైలులో ప్రయాణించే ముందు ఇది తెలుసుకోండి!

రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే లగేజీ పరిమితులను నిర్దేశించింది. ప్రయాణ తరగతిని బట్టి లగేజీ బరువుపై రుసుము వసూలు చేస్తారు. ఒక్కరి దగ్గర AC ఫస్ట్ క్లాస్‌లో 70KGS, AC 2టైర్‌లో 50KGS, AC 3టైర్& స్లీపర్‌లో 40KGS, జనరల్ బోగీలో 35 కేజీల బరువు కంటే మించకూడదు. ఈ పరిమితిని మించి తీసుకెళ్లాలనుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. SHARE IT