News March 19, 2024
CA పరీక్ష తేదీల మార్పు

లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఏ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. CA ఇంటర్ కోర్సు గ్రూప్-1 పరీక్షలు మే 3, 5, 9న, గ్రూప్-2 ఎగ్జామ్స్ 11, 15, 17న నిర్వహించనున్నట్లు ICAI ప్రకటించింది. ఫైనల్ ఎగ్జామినేషన్లో గ్రూప్-1 పరీక్షలు మే 2, 4, 8న, గ్రూప్-2 ఎగ్జామ్స్ 10, 14, 16న నిర్వహిస్తామని తెలిపింది. పూర్తి వివరాలను www.icai.org వెబ్సైట్లో పొందుపరిచింది.
Similar News
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం: లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వకపోతే..?

వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఉంటుంది. అందులో మొదటి 3 రోజులు మాత్రమే లక్కీ డిప్ ద్వారా భక్తులను ఎంపిక చేస్తారు. లక్కీ డిప్లో సెలక్ట్ అవ్వని భక్తులకు నిరాశ అనవసరం. JAN 2 – JAN 8వ వరకు రోజుకు 15K చొప్పున విడుదలయ్యే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటిని బుక్ చేసుకున్న అందరికీ వైకుంఠ ద్వారం గుండా దర్శనం లభిస్తుంది. ఇవి DEC 5న విడుదలవుతాయి. ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి.
News November 28, 2025
త్వరలో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

త్వరలో <
News November 28, 2025
ఈ ఏడాది మామిడి పూత ఆలస్యమౌతుందా?

మామిడిలో పూత రావడానికి నేలలో బెట్ట పరిస్థితులు, చలి వాతావరణం ఉండాలి. అయితే ఈశాన్య రుతుపవన వర్షాల వల్ల ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో భూమి తడిగానే ఉంటోంది. ఈ వానల వల్ల డిసెంబర్-జనవరిలో రావాల్సిన పూత.. జనవరి-ఫిబ్రవరిలో వస్తుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. పూత తొందరగా రావాలని పురుగు మందుల షాపు వ్యాపారుల మాటలు నమ్మి మందులు వాడకుండా.. వ్యవసాయ నిపుణుల సూచనలను మామిడి రైతులు పాటించడం మంచిది.


