News April 8, 2024

కవిత బెయిల్ పిటిషన్ విచారణ తేదీ మార్పు

image

TG: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణ తేదీలో మార్పు చోటు చేసుకుంది. మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో సాధారణ బెయిల్‌పై విచారణ త్వరగా చేయాలని కవిత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో ఈనెల 20న జరగాల్సిన విచారణను 16కు కోర్టు వాయిదా వేసింది.

Similar News

News March 3, 2025

ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక ప్రకటన

image

AP: ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రి అనగాని సత్యప్రసాద్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తామన్నారు. ఇప్పటివరకు 70,232 దరఖాస్తులు వచ్చాయని, ఇంటి నిర్మాణానికి ₹4లక్షల ఆర్థిక సాయం కూడా చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో నివాసయోగ్యం కాని భూములు, శ్మశానాలు, డంపింగ్ యార్డుల పక్కనున్న భూములు, వర్షం వస్తే మునిగిపోయే భూములను ఇచ్చారని ఆరోపించారు.

News March 3, 2025

KKR కొత్త జెర్సీ.. కొత్త సంప్రదాయానికి నాంది

image

IPL-2025 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కొత్త జెర్సీని ఆవిష్కరించింది. గత సీజన్‌తో పోలిస్తే ఇది పూర్తి డిఫరెంట్‌గా ఉంది. అలాగే ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీని గెలిచినందుకు గుర్తుగా జెర్సీపై 3 స్టార్లను పెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో జెర్సీ షోల్డర్లకు గోల్డ్ బ్యాడ్జ్‌లు ఉండనున్నాయి. లీగ్ చరిత్రలో ఈ బ్యాడ్జ్ ధరించిన తొలి టీమ్‌గా KKR నిలిచింది. ఇకపై ఏటా ఈ సంప్రదాయం కొనసాగనుంది.

News March 3, 2025

వివి వినాయక్ హెల్త్ రూమర్స్‌కు చెక్

image

ప్రముఖ దర్శకుడు VV వినాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. ఆయన గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించింది. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని అభిమానులను కోరింది. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా గతేడాది ఛత్రపతి మూవీని హిందీలో రీమేక్ చేసిన ఆయన ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు.

error: Content is protected !!