News April 2, 2024

మరోసారి తెరపైకి నాయకత్వ మార్పు!

image

కర్ణాటక కాంగ్రెస్‌ GOVTలో నాయకత్వ మార్పు అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో CM సిద్ధారామయ్య, డిప్యూటీ CM DK శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ‘లోక్‌సభ ఎన్నికల్లో మా అభ్యర్థులు గెలిస్తే నన్ను ఎవరూ తాకలేరు. నేను సీఎంగా ఉండాలా?వద్దా?’ అని సిద్ధారామయ్య అన్నారు. ‘నన్ను దృష్టిలో ఉంచుకునే మీరు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు. మీ కోరిక నెరవేరకపోదు’ అని DK అనడం గమనార్హం.

Similar News

News March 20, 2026

PHOTO GALLERY: గద్దర్ అవార్డుల వేడుక

image

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, జయసుధ, నారాయణ మూర్తి, రామ్ చరణ్, సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, అవార్డుల విజేతలు హాజరయ్యారు. పైన గ్యాలరీలో కొన్ని ఫొటోలను చూడొచ్చు.

News March 20, 2026

మార్చి 20: చరిత్రలో ఈ రోజు

image

1351: ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం(ఫొటోలో)
*అంతర్జాతీయ సంతోష దినం

News March 20, 2026

తండ్రి అయిన RCB కెప్టెన్

image

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ తండ్రి అయ్యారు. ఆయన భార్య గుంజన్ పండంటి మగ బిడ్డకు నిన్న జన్మనిచ్చారు. దీంతో IPL ప్రారంభానికి వారం రోజుల ముందే వారి ఇంట్లో ఆనందం వెల్లివెరిసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండర్‌కు చెందిన పాటీదార్ 2022లో గుంజన్‌ను వివాహమాడారు. మరోవైపు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా <<19424001>>ఉగాది రోజునే<<>> మరోసారి తండ్రయ్యారు. దినేశ్, పాటీదార్ ఒకేరోజు పుట్టడం(జూన్ 1) విశేషం.