News October 1, 2024
‘జగనన్న తోడు’ స్కీమ్ పేరు మార్పు

AP: రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం పేరును మార్చింది. ‘జగనన్న తోడు’ స్కీమ్ పేరును ‘చిరువ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.10వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తారు.
Similar News
News November 23, 2025
తోగుట: యువకుడి సూసైడ్

ప్రేమ విషయంలో తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తోగుట మండలం బండారుపల్లిలో చోటు చేసుకుంది. తోగుట ఎస్ఐ రవికాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగం వేణు(19) గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేస్తున్నట్లు మృతుడి తండ్రి పోచయ్య ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News November 23, 2025
చెమటోడ్చుతున్న భారత బౌలర్లు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. రెండో రోజూ ఆట తొలి సెషన్లో వికెట్లేమీ తీయలేదు. అర్ధసెంచరీ చేసిన ముత్తుస్వామి(56*), కైల్(38*) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఏడో వికెట్కు 70 పరుగులు జోడించారు. టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు తొలి ఇన్నింగ్సులో 316/6.
News November 23, 2025
రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు: ఐబొమ్మ రవి తండ్రి

<<18323509>>ఎన్కౌంటర్<<>> చేయాలన్న నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తప్పు బట్టారు. ‘ఆయనను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు రేట్లు పెరిగాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు. నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తా’ అని చెప్పారు.


