News July 2, 2024
‘కులగురు’గా వీసీ పదవి పేరు మార్పు

రాష్ట్రంలోని యూనివర్సిటీల ‘వైస్ ఛాన్స్లర్’ పదవి పేరును ‘కులగురు’గా మార్చే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మన సంస్కృతి సంప్రదాయాలతో అనుబంధాన్ని ఏర్పరుస్తుందని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ‘కులపతి అనే పదం అప్పుడప్పుడు ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఆ స్థానంలో ఉన్న జీవిత భాగస్వాములను కులపతి భర్తలుగా పేర్కొనడం ఇబ్బందిరకంగా మారింది’ అని సీఎం పేర్కొన్నారు.
Similar News
News January 1, 2026
డెలివరీ అయ్యాక బెల్ట్ వాడుతున్నారా?

డెలివరీ అయ్యాక కండరాల పటుత్వం కోసం, పొట్ట పెరగకుండా ఉండేందుకు చాలా మంది మహిళలు Abdominal Belt వాడుతుంటారు. నార్మల్ డెలివరీ అయితే 1-2 రోజులకు, సిజేరియన్ అయితే డాక్టర్ సూచనతో 7-10 రోజులకు మొదలుపెట్టొచ్చని గైనకాలజిస్టులు చెబుతున్నారు. రోజుకు 2-8 గంటలు, మూడు నెలల పాటు వాడితే సరిపోతుందంటున్నారు. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు బెల్ట్ వాడకూడదని చెబుతున్నారు.
News January 1, 2026
MSME టెక్నాలజీ సెంటర్, విశాఖపట్నంలో ఉద్యోగాలు

MSME టెక్నాలజీ సెంటర్, విశాఖపట్నంలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు JAN 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/B.Tech, డిప్లొమా, డిగ్రీ, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫ్యాకల్టీ, పర్చేజ్ ఇంఛార్జ్, హాస్టల్ వార్డెన్ పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పోస్టులకు గరిష్ఠ వయసు 30ఏళ్లు. వెబ్సైట్: www.msmetcvizag.org
News January 1, 2026
పుతిన్ నివాసంపై దాడి అబద్ధం.. రష్యాకు CIA షాక్

తమ అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిందన్న రష్యా ఆరోపణలను US గూఢచారి సంస్థ CIA కొట్టిపారేసినట్లు అమెరికన్ మీడియా సంస్థలు తెలిపాయి. వాటి కథనాల ప్రకారం.. ఉక్రెయిన్ లక్ష్యం కేవలం సైనిక స్థావరాలేనని పుతిన్ నివాసం కాదని CIA తెలిపింది. ఈ మేరకు CIA డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ అధ్యక్షుడు ట్రంప్నకు నివేదిక సమర్పించారు. ఆధారాలు లేకుండా రష్యా ఆరోపణలు చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


