News August 11, 2025
పోలింగ్ కేంద్రాల మార్పు: హైకోర్టులో YCP పిటిషన్ రిజెక్ట్

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల మార్పుపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ ఎన్నికల్లో ఒక ఊరిలోని 6 పోలింగ్ బూత్‌లను మరో ఊరికి మార్చడంపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. మరికొన్ని గంటల్లో(రేపు) పోలింగ్ పెట్టుకుని మార్చడం కుదరదన్న ఈసీ న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.
Similar News
News August 11, 2025
AP DSC ఫలితాలు విడుదల

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ <
News August 11, 2025
వైభవ్ సూర్యవంశీపై BCCI ఫోకస్?

సీనియర్లు ఒక్కొక్కరుగా రిటైర్ అవుతుండటంతో పద్నాలుగేళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై BCCI ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అతడిని అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు బోర్డు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి NCA స్పెషల్ ట్రైనింగ్ ఇస్తోంది. T20, వన్డేలకు వైభవ్ అటాకింగ్ స్టైల్ చక్కగా సరిపోతుందని భావిస్తోందట. దీర్ఘ దృష్టితో అతడిని ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News August 11, 2025
AI భయం.. ఉద్యోగం భద్రమేనా?

AI ఎంట్రీతో టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత విధిస్తుండటంతో తమ జాబ్ ఉంటుందో ఊడుతుందోనని IT ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సాఫ్ట్‌వేర్ అని గర్వంగా చెప్పిన గొంతులు నేడు బొంగురుపోయే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులు ఆగిపోవడం, తొలగింపులు పెరగడంతో ఉద్యోగ భద్రత, AI ప్రభావంపై చర్చ మొదలైంది. ఇది తాత్కాలికమా? మళ్లీ పునర్వైభవం వస్తుందా? అంటూ తమ భవిష్యత్తుపై ఉద్యోగులు బెంగపెట్టుకుంటున్నారు.