News November 17, 2024

రాష్ట్రంలో స్కూళ్ల టైమింగ్స్ మార్పు?

image

APలో హైస్కూళ్ల టైమింగ్స్ మార్చడంపై విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిలబస్ కవర్ చేయడం సహా టీచర్లు ఒత్తిడి లేకుండా విద్యార్థులకు పాఠాలు చెప్పేలా సా.5 గంటల వరకు స్కూళ్లు నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ప్రతి మండలంలో ఒక స్కూలులో ఈ టైమింగ్స్ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. దీని ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది.

Similar News

News November 18, 2024

డిసెంబర్ 15 నాటికి కొత్త విధానం: నారాయణ

image

AP: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే కొత్త విధానం రూపొందించామని నెల్లూరులో అధికారులతో సమీక్షలో మంత్రి చెప్పారు. ప్రజలు తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.

News November 18, 2024

నిద్రపోకుండా వ్యాయామం చేస్తున్నారా?

image

రోజూ ఉదయమే నిద్రలేచి వ్యాయామం, వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే దీనికోసం ఉదయం 4/5 గంటలకే లేచి ఎక్కువసేపు వ్యాయామం చేయడం మంచిదా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. డా. సుధీర్ కుమార్ రిప్లై ఇచ్చారు. ‘అందరికీ 7-9 గంటలు నిద్ర అవసరం. నిత్యం తక్కువ నిద్రపోయి ఎక్కువసేపు వ్యాయామం చేయడం మంచిదికాదు. వ్యాయామం చేసేముందు వాంఛనీయ నిద్ర ఉండేలా చూసుకోండి’ అని ఆయన సూచించారు. మీరు రోజూ ఎంతసేపు నిద్రపోతారు?

News November 18, 2024

హెజ్బొల్లా కీలక నేత హతం

image

హెజ్బొల్లా మీడియా రిలేషన్స్ చీఫ్‌ మహ్మద్ అఫీఫ్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. బీరుట్‌లో జరిపిన ఐడీఎఫ్ వైమానిక దాడిలో అఫీఫ్ మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాలోనూ దాడులు చేస్తోంది. ఇవాళ జరిపిన దాడుల్లో 12 మంది పౌరులు మరణించారు. కాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.