News June 7, 2024
హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తారా?

AP: విజయవాడలోని డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీకి NTR పేరును పునరుద్ధరిస్తారా అనే చర్చ మొదలైంది. దేశంలోనే తొలి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా పేరున్న ఈ వర్సిటీ పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ వర్సిటీగా మార్చడంతో టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా ఎన్నికల్లో ఇప్పుడు TDP ప్రధాన పక్షంగా ఉన్న NDA కూటమి అధికారం చేపట్టబోతోంది. ఈనేపథ్యంలోనే వర్సిటీ పేరు మార్పు తెరపైకి వచ్చింది.
Similar News
News September 9, 2025
ఆ కంపెనీలపై ట్రంప్ పన్ను పోటు!

అమెరికాలో విదేశీ వర్కర్లను నియమించుకునే కంపెనీలపై 25 శాతం అదనంగా పన్నులు విధించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పన్నులు ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు సమాచారం.
News September 9, 2025
డొనాల్డ్ ట్రంప్ మనవరాలిని చూశారా?

యూఎస్ ఓపెన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ సందడి చేసింది. ఈ ఈవెంట్‌కు ట్రంప్‌తో పాటు ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుష్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా కళ్లన్నీ 13 ఏళ్ల అరబెల్లానే ఫోకస్ చేయడంతో ఆమె హైలైట్ అయ్యారు. తన తాత ట్రంప్‌తో ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎంపీలతో లోకేశ్ భేటీ

AP: ఉపరాష్ట్రపతి ఓటింగ్ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. కాగా టీడీపీకి లోక్‌సభలో 16, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలం ఉంది.